Site icon Prime9

Rangabali Movie : నాగశౌర్య “రంగబలి” మూవీ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

naga shourya rangabali movie teaser released

naga shourya rangabali movie teaser released

Rangabali Movie : యంగ్ హీరో నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో శౌర్యకి జోడీగా “యుక్తి తరేజా” నటిస్తుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, సప్తగిరి, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా షైన్ టామ్ చాకో కనిపిస్తున్నాడు. ‘దసరా’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే.  పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జులై 7వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని రిలీజ్ చేశారు. నాని ‘దసరా’ సినిమాని తెరకెక్కించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. టీజర్ చూస్తుంటే మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. గతంలో శౌర్య నటించిన ఛలో సినిమా మాదిరి ఈ మూవీలో కూడా మాస్ అండ్ కామెడీ బ్యాలన్స్ గా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. నాగశౌర్య చివరి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ థియేటర్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది. మరి నాగశౌర్యకి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.

 

Exit mobile version