Site icon Prime9

Naga Chaitanya “NC22” Movie: పోలీస్ ఆఫీస‌ర్‌గా నాగచైతన్య… అక్కినేని అభిమానులకు పండుగే..!

NC22 movie update prime9 news

NC22 movie update prime9 news

Naga Chaitanya “NC22” Movie: టాలీవుడ్ యువ మన్మథుడిగా నాగచైతన్యకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. ల‌వ్‌స్టోరీ, బంగార్రాజు వంటి వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్న నాగ‌చైత‌న్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్ వేసింది. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫేయిల్యూర్‌గా మిగిలిపోయింది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే  చైతన్య ‘ధూత’ అనే హార‌ర్‌ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండ‌గానే నాగ‌చైత‌న్య త‌న తర్వాతి “NC22” చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు.

ఇటీవ‌లే ‘మానాడు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన వెంక‌ట్ ప్ర‌భు డైరెక్షన్లో చైత‌న్య ఈ చిత్రాన్ని చేయ‌నున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ బిగ్ అప్‌డేట్‌ను డైరెక్టర్ వెంకట్ ప్రభు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ బుధ‌వారం ప్రారంభం కానున్న‌ట్లు ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ప్రేక్షకుల ముందు రిలీజ్ చేశారు.

ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆస‌క్తిని క్రియేట్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: Megastar Chiranjeevi: “నేను రాజకీయానికి దూరం కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అంటున్న చిరంజీవి

Exit mobile version