Site icon Prime9

Naga Chaitanya : హీరోయిన్ తో డేటింగ్ రూమర్స్ పై నాగ చైతన్య రియాక్షన్ .. ధూత మూవీ ప్రమెషన్ లోచాలా క్లియర్ గా ..

naga-chaitanya-reaction-on-his-relationship-rumours

naga-chaitanya-reaction-on-his-relationship-rumours

Naga Chaitanya :అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేస్తూన్న సంగతి తెలిసిందే . మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్ లో చేస్తున్నాడు .తాజాగా దూత సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య తన ఫస్ట్ వెబ్ సిరీస్ దూత ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు.

అయితే సమంతతో విడిపోయింది మొదలు.. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారనే టాక్సూ వచ్చాయి. అయితే ఇదే టాక్‌ పై తాజాగా రియాక్ట్ అయ్యారు నాగచైతన్య. తన రియాక్షన్ ఏంటో.. మీడియా ముఖంగా చాలా క్లియర్ గా చెప్పారు. ధూత మూవీ ప్రమెషన్ ఇంటర్వ్యూలోనే.. హీరోయిన్‌తో డేటింగ్ న్యూస్ పై రియాక్టయ్యారు. ఇక ఇదే విషయంగా ప్రశ్న అడిగిన ఓ ఇంటర్వ్యూయర్ కు సమాధానం చెబుతూ.. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా పర్లేదు అన్నట్టు నవ్వేశారు. అంతేకాదు హీరోయిన్‌తో లింకులు పెడుతూ.. తన పై వచ్చిన వార్తలను తాను పట్టించుకోనని.. ఇలాంటి వాటి గురించి ఏం చెప్పినా .. ఎంత చెప్పినా ఆగవని నాగ చైతన్య అన్నారు. ఇక పర్సనల్ స్పేస్‌లో తాను చాలా హ్యాపీగా ఉన్నానని.. ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే తానే అందరితో చెబుతా అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక ధూత ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సస్పెన్స్ గా ఉంది. అందులో నాగ చైతన్య ఒక జర్నలిస్ట్ గా కనపడబోతున్నట్టు, ఒక దినపత్రికని స్థాపించబోతున్నట్టు, అతనికి గతం తాలూకు ఏవో వెంటాడుతున్నట్టు, అనుకోకుండా అతని చుట్టూ హత్యలు, వాటిల్లో అతను ఇరుక్కుంటున్నట్టు చూపోయించారు. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా సాగబోతుందని తెలుస్తుంది.ఇటీవలే దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దూత సిరీస్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో తెలియాల్సి ఉంది.నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా ఓ సినిమా చేస్తున్నారు.

Exit mobile version