Site icon Prime9

Naga Chaitanya Wedding: చై-శోభితల పెళ్లి సందడి షురూ – కొత్త జంటకు మంగళ స్నానాలు పూర్తి, ఫోటోల వైరల్

Naga Chaitanya and Sobhita Haldi Wedding Celebrations: అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ పెళ్లి సందడి మొదలైంది. డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇక పెళ్లి వేడుకలో భాగంగా తాజాగా శోభిత, నాగచైతన్యల హల్దీ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరికి ఒకేచోట మంగళ స్నానాలు చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాబోయే వధూవరులు ఇద్దరికి పసుపు రాసి మంగళ స్నానం చేయించారు.

ఇందులో చై వైట్‌ డ్రెస్‌లో ఉండగా.. శోభిత ఎర్ర చీరలో మెరిసిపోయింది. అంతేకాదు హల్దీ వేడుకలో భాగంగా ఆమెకు ఎల్లో కలర్‌ శారీ కట్టుకుంది. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకలో అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. కాగా అన్నపూర్ణ స్టూడియో జరిగే వీరి వివాహమహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా చై-శోభితలే దగ్గురుండి చూసుకుంటున్నారు. ఈ పెళ్లి వచ్చే అతిథుల లిస్ట్‌ కూడా వారే నిర్ణయిస్తున్నారట. ఇండస్ట్రీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కలిపి మొత్తం 300 మంది ఆహ్వానం పలుకుతున్నట్టు నాగార్జున తెలిపారు.

ఇక చై- శోభిత తమ అభిరుచికి తగ్గట్టుగా సంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటున్నట్టు ఇటీవల నాగార్జున ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పారు. ఇదిలా ఉంటే తన బర్త్‌డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగచైతన్య కాబోయే భార్య శోభితపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శోభితతో కొత్త జీవితం ప్రారంభించేందుకు తాను చాలా ఆశగా ఎదురుచూస్తున్నానన్నాడు. శోభిత తనని చాలా బాగా అర్థం చేసుకుందని, తనకు చాలా కనెక్ట్‌ అయ్యానన్నాడు. తన జీవితంలో ఉన్న శూన్యాన్ని తను పూర్తి చేస్తుందని నమ్ముతున్నానని చెప్పాడు.

కాగా సమంత విడాకుల తర్వాత నాగచైతన్య శోభితకు దగ్గరయ్యాడు. కొన్నేళ్లుగా సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఏప్పుడు తమ డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించలేదు. కానీ తరచూ వెకేషన్‌కు వెళ్లి మీడియా కంట పడ్డారు. కానీ ఎప్పుడు కూడా తమ రిలేషన్‌పై పెదవి విప్పలేదు. అయితే ఏడాది ఆగష్టులో నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చారు. అలా నిశ్చితార్థంతో తమ రిలేషన్‌ని ఆఫీషియల్‌ చేసిన చై-శోభితలు ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఈ కాబోయే జంట ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

Exit mobile version