Site icon Prime9

Naga Babu : మాట నిలబెట్టుకున్నమెగా బ్రదర్ నాగబాబు.. “ఆరెంజ్” మూవీ కలెక్షన్స్ జనసేనకు విరాళం

naga babu donated orange movie collections to janasena

naga babu donated orange movie collections to janasena

Naga Babu : మెగా పవర్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ ఇటీవల రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. పదేళ్ల క్రిందటి రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పుడు డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఎంతలా అంటే ఆ రెస్పాన్స్ చూసి ఈ సినిమాని జపాన్ లో కూడా రీ రిలీజ్ చేయాలని డిమాండ్ రావడంతో.. అక్కడ కూడా రిలీజ్ చేశారు. దీంతోనే అర్దం అవుతుంది ఆరెంజ్ సినిమా ఏ రేంజ్ లో మానియా క్రియేట్ చేసిందో అని.

కాగా ఈ రీ రిలీజ్ పై వచ్చే కలెక్షన్స్ అన్నిటిని జనసేన పార్టీకి ఫండ్ రూపంలో ఇస్తానంటూ నాగబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మూవీ మొత్తం కలెక్షన్స్ ని నాగబాబు.. పలువురు ప్రముఖులతో కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి అందజేశారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా ఏ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ చెంజర్” లో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ  హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ క్లైమాక్స్ కి సంబంధించిన షూట్ ని పూర్తి చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పై దసరా సమయంలో క్లారిటీ ఇస్తామంటూ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

 

 

Exit mobile version