Site icon Prime9

Kushi Movie : వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచిన విజయ్, సామ్ “నా రోజా నువ్వే సాంగ్”..

naa roja nuvve song from kushi movie got trending on world wide

naa roja nuvve song from kushi movie got trending on world wide

Kushi Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా కలిసి నటిస్తున్న చిత్రం “ఖుషి”. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే’ అంటూ సాగే ఈ పాటకి దర్శకుడు శివ నిర్వాణనే లిరిక్స్ ని అందించాడు. ఈ సాంగ్ లిరిక్స్ ని డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లతో సమకూర్చడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ పాటని పాడాడు. ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సాంగ్ మ్యూజిక్, లిరిక్స్ తో పాటు విజువల్స్, సమంత అండ్ విజయ్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు మంచి ఫీల్ గుడ్ గా అనిపించింది.

దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.  తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల నుంచీ అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. ఇక యూట్యూబ్ లో దాదాపు 15 మిలియన్ వ్యూస్ తో పాటు లక్ష లైక్స్ తో వాల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్నిసొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కే ఇంతటి రెస్పాన్స్ రావడంతో మూవీ టీం ఫుల్ ఖుషిలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

 

టాలీవుడ్ లోకి “పెళ్లి చూపులు” అనే చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడి హీరో కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. మనోడికి కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా విజయ్ పై క్రష్ ఉందని.. తనతో నటించాలని ఉందంటూ మనసులోని మాటల్ని బయటపెట్టారు. కాగా ఈ క్రేజీ హీరో ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ సినిమా అయినా మంచి హిట్ అందుకోవాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కేవలం విజయ్ కి మాత్రమే కాకుండా సమంతాకి కూడా ఈ టైమ్ లో మంచి హిట్ అవసరం అని చెప్పాలి. ఆమె గత చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. గుణశేఖర్ భారీస్థాయిలో దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మించిన ఈ చిత్రం ఘోర పరాజయం మూట గట్టుకుంది. దీంతో వీరిద్దరికీ ఈ మూవీ హిట్ అనేది బాగా కావాల్సిన విషయం.

 

Exit mobile version