Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. ఇటీవల తాను నటించిన ఖుషి సినిమా మంచి విజయం సాధించడంతో.. తన సంపాదన నుంచి కోటి రూపాయలు.. వంద కుటుంబాలకు అందించాడు. అవసరాల్లో ఉన్నవారికి డబ్బులు అందాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం కోటబొమ్మాళికి మండలం కురుడు గ్రామంలో షర్మిల శ్రీ అనే పాప ఇటీవల ఓ యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంది. ఆ కుటుంబం కష్టాల్లో ఉండటంతో అక్కడి విజయ్ దేవరకొండ అభిమానుల సంఘం విజయ్ కి ఈ విషయం తెలియచేయగా.. మొన్న ఖుషి సినిమా సక్సెస్ లో భాగంగా ఈ ఫ్యామిలీకి కూడా లక్ష రూపాయలు అందేలా చేశారు. విజయ్ దేవరకొండ అభిమానులు లక్ష రూపాయల చెక్కుని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఆ పాపకి అందచేశారు. దీనిపై ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండకి థ్యాంక్స్ చెప్పింది.
ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దైవం మనుష్య రూపేణ అనే వాఖ్యానికి అర్ధంగా నిలుస్తూ నటుడు విజయ్ దేవరకొండ చేసిన సహాయం నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి తాను కూడా అండగా నిలబడతానని చెప్పి వారికి ఈ డబ్బులు వచ్చేలా చేసిన శ్రీకాకుళం విజయ్ దేవరకొండ అభిమానులను అభినందించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారగా పలువురు విజయ్ ని అభినందిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ (Vijay Devarakonda) అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అదే ఊపులో `నోటా`, `టాక్సీవాలా`, `డియర్ కామ్రేడ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `లైగర్` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ వరుస చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గానే సమంతతో కలిసి నటించిన “ఖుషి” మూవీతో మంచి సక్సెస్ అందుకొని మళ్ళీ వరుస సక్సెస్ లు అందుకోవల్ని భావిస్తున్నారు.