Site icon Prime9

National Cinema Day: ఈ నెల 16న అన్ని ధియేటర్లలో రూ.75 కే మూవీ టిక్కెట్

National Cinema Day

National Cinema Day: సెప్టెంబర్ 16న భారతదేశంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినీ ప్రియులందరికీ భారతదేశం అంతటా అన్ని సినిమాలకు భారీ ధర తగ్గింపు లభించనుంది. అన్ని సినిమా హాళ్లు నామ మాత్రంగా కేవలం రూ. 75 మాత్రమే వసూలు చేస్తాయి. ఈ ధర సాధారణ థియేటర్‌లలో మాత్రమే కాకుండా మల్టీప్లెక్స్‌లకు కూడా వర్తిస్తుంది.

ప్రకటించిన ఈ ఒకరోజు ఆఫర్ భారతదేశం అంతటా 4,000 కంటే ఎక్కువ థియేటర్లలో వర్తిస్తుంది. కోవిడ్-19 తర్వాత సినిమా థియేటర్‌లు విజయవంతంగా పునఃప్రారంభమైన సందర్భంగా సినీ ప్రేక్షకులకు థియేటర్ యజమానులు ఈ ఆఫర్ ను ఇవ్వడానికి సిద్దమయ్యారు.

అన్నింటికంటే మించి, ఈ జాతీయ సినిమా దినోత్సవం సినిమా అభిమానులకు రణబీర్ కపూర్-ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర వంటి కొత్త సినిమాలను రూ. 75కి చూసే ఛాన్స్‌ని ఇస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

Exit mobile version