Site icon Prime9

Mokshagna: ఆర్ఆర్ఆర్ తనయుడితో బాలయ్య వారసుడు

Tollywood: నందమూరి మోక్షజ్ఞ తాజా ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్‌తో కలిసి మోక్షజ్ఞ కనిపించాడు.

నోవాటెల్‌లో జరిగిన ఫీనిక్స్ గ్రూప్ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ 60వ పుట్టినరోజుకు మోక్షజ్ఞ హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో మోక్షజ్ఞ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పెద్దలను వినయంగా పలకరించాడని, వారు తనవద్దకు వచ్చినపుడు లేచి నుంచున్నాడని చెబుతున్నారు. తన తండ్రి బాలకృష్ణ నటన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే మోక్షజ్ఞ నటన పై ఇపుడు అందరి దృష్టి ఉంది.

మోక్షజ్ఞ కూడ తన సినీరంగ ప్రవేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే తన అదనపు బరువును తగ్గించుకున్నాడని తెలుస్తోంది. మరో ఏడాదిలోగా టాలీవుడ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ వుంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి

Exit mobile version