Site icon Prime9

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని స్వీకరించిన కీరవాణి పుత్రులు

mm Keeravani sons green India challenge

mm Keeravani sons green india challenge

Green India Challenge: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పుత్రులు ఇద్దరు కాళభైరవ, శ్రీసింహ మొక్కలు నాటారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామానాయుడు స్టూడియో ఆవరణలో వీరిరువురు మొక్కలు నాటారు. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమని వారు అన్నారు. మొక్కలు నాటడం వల్ల మనకు మరియు వాతావరణానికి ఎంతో మంచి జరుగుతుందన్నారు.

ప్రముఖ హీరోయిన్ రెజినా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి మేము మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇంతటి గొప్ప కార్యక్రమం లో మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీసింహ మరియు కాళభైరవ చెప్పారు. మొక్కలు నాటడం వాటి సంరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: Megastar Chiranjeevi: “నేను రాజకీయానికి దూరం కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అంటున్న చిరంజీవి

Exit mobile version