Megastar Chiranjeevi : సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది “మెగాస్టార్ చిరంజీవి” అనడంలో అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమకి చెందిన వారికే కాకుండా అభిమానులకు కూడా ఎంతో మందికి అండగా నిలిచారు మెగాస్టార్.. నిలుస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అక్కర్లేదు అని చెప్పవచ్చు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసరాలు హెల్త్ కిట్స్ వ్యాక్సిన్స్ పంపిణీ చేశారు. ఇవే కాకుండా సినీ జర్నలిస్టులకు ఎన్నో విధాలుగా సాయపడ్డారు. చిరు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడుతోన్నారు. సాయం బయటకు చెప్పకుండా మరెంతో మందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటుంది మెగా ఫ్యామిలీ.
ఈ మేరకు ఇప్పుడు మరోసారి మంచి మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని రోజులు క్రిందట ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ స్కాన్ సెంటర్ ని చిరు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన అభిమానులు కోసం ఒక రిక్వెస్ట్ చేశారు. క్యాన్సర్ పై అవగాహన లేక చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారు. దానిని ముందుగా గుర్తించాలన్న ఏ టెస్టులు చేయించుకోవాలో తెలియని వారు చాలామంది ఉన్నారు. వారందరి కోసం తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షల నిర్వహించమని.. వాటికి అయ్యే ఖర్చులు తానూ భరిస్తాను అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
జూలై 9న చిరంజీవి (Megastar Chiranjeevi) బ్లడ్ బ్యాంక్ లో కాన్సర్ టెస్టులు..
ఇప్పుడు తాజాగా ఈ క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్ గురించి చిరంజీవి మీడియాకి తెలియజేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి, డాక్టర్ గోపిచంద్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “క్యాన్సర్ కు సంబంచిన టెస్టులను అభిమానులు, సినీ వర్కర్స్ కు చేయించాలని కోరిన వెంటనే గోపిచంద్ గారు ఏర్పాటు చేశారు. జూలై 9న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కాన్సర్ టెస్టులు చేస్తారు. రోజుకు వేయి మందికి చొప్పున అన్ని రకాల కాన్సర్ టెస్టులు చేస్తారు. రెండు మూడు రోజుల్లో సినీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై ఈ విషయాన్ని చర్చిస్తాం. ఈ క్యాన్సర్ స్క్రినింగ్ కోసం ప్రత్యేక కార్డులు జారీ చేస్తాం. జులై 9న హైదరాబాద్, 16న వైజాగ్, 23న కరీంనగర్ లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తాం” అని తెలియజేశారు. దీంతో మెగాస్టార్ ని మంచితనాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ మెగా అభిమనులంతా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.
ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 10 లక్షల యూనిట్స్ వరకు రక్తాన్ని సేకరించి అవసరమైన పేదవారికి అందజేశారు. ఇక ఐ బ్యాంక్ ద్వారా 70 వేల మంది వరకు కార్నియా మార్పిడికి దోహద పడి చూపులేని వారికి చూపు వచ్చేలా చేశారు. అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు విరాళాలను సేకరించి ఎంతోమంది కుటుంబాలకు సహాయపడ్డారు. ఇక ఇప్పుడు ఈ రకంగా మెగాస్టార్ మంచి చేస్తూనే ఉంటున్నారు.