Site icon Prime9

Megastar Chiranjeevi: అభిమాని కోర్కె తీర్చిన మెగాస్టార్.. కార్పొరేట్ వైద్యం చేయిస్తానని భరోసా

Tollywood: మెగాస్టార్ చిరంజీవి తనను కలవాలనుకుంటున్న అభిమాని కోర్కె తీర్చడం తోపాటు అతనికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు భరోసా ఇచ్చి తన ఉదారతను, సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన కొయ్య నాగరాజు చిరంజీవి వీరాభిమాని. దురదృష్టవశాత్తు అతనికి రెండు కిడ్నీలు పాడై పోయాయి. ఎలాగైనా తమ అభిమాన హీరో చిరంజీవిని కలిసి ఆయనతో ఒకసారి మాట్లాడాలని తపన పడ్డాడు. తన కోర్కెను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి అతను కలిసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 5వ తేదీన నాగరాజు తన కుటుంబ సభ్యులతో మెగా స్టార్ ను కలిశాడు. కుశలప్రశ్నల తర్వాత అతని ఆరోగ్య, ఆర్థిక పరిస్థితలను తెలుసుకున్న మెగాస్టార్ చలించిపోయారు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తానని నాగరాజు దంపతులకు భరోసా ఇచ్చారు. ఇక చిరుతో కలవడంతో అభిమాని ఉబ్బితబ్బిబయ్యాడు. తన చిన్ననాటి కోరిక తీరడమే కాకుండా వైద్య సహాయానికి భరోసా ఇవ్వడంతో అతని కుటుంబం సంతోష సాగరంలో మునిగిపోయింది.

Exit mobile version