Megastar Chiranjeevi : మెగా ఫ్యామిలీకి ఇది మరో మరచిపోలేని రోజు అని చెప్పాలి. రామ్ చరణ్ దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. ఈరోజు ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలిని చూసుకున్న చిరంజీవి.. కాసేపటి క్రితం మళ్లీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులతో చిన్నారి గురించి మాట్లాడారు. ఆంజనేయస్వామికి ప్రత్యేకమైన మంగళవారం నాడు ఆడబిడ్డ జన్మించడాన్ని తాము అపురూపంగా భావిస్తున్నామని తెలిపారు. అపోలో ఆసుపత్రి ఛైర్మన్ పీసీ రెడ్డి (ఉపాసన తాత) దగ్గరుండి అన్ని రకాలుగా కేర్ తీసుకున్నారని, బెస్ట్ మెడికల్ టీమ్ ని ఏర్పాటు చేశారని అన్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఉపాసనకు సుఖ ప్రసవం జరిగిందని వెల్లడించారు.
Megastar Chiranjeevi : మనవరాలి గురించి చెబుతూ మురిసిపోయిన మెగాస్టార్ చిరంజీవి..

megastar chiranjeevi emotional words about her grand daughter