Site icon Prime9

Megastar Chiranjeevi : చరణ్ ని చూసి ఓ తండ్రిగా గర్విస్తున్న.. జేమ్స్ కామెరూన్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

megastar chiranjeevi emotional post on charan goes viral

megastar chiranjeevi emotional post on charan goes viral

Megastar Chiranjeevi : దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రలు అద్భుతంగా నటించారు. ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు వేదికల మీద తన సత్తా చాటుకుంది ఆర్ఆర్ఆర్. ఎన్నో అవార్డ్ లను కైవసం చేసుకుంది, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇక ఆస్కార్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

జేమ్స్ కామెరూన్ ఏమన్నారంటే (Megastar Chiranjeevi)..?

ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ కామరూన్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి గుర్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ పాత్ర తనకు ఎంతో నచ్చిందంటూ కితాబిచ్చారు కామరూన్ కాకపోతే ఆ పాత్రను అర్ధం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుందన్నారు. కానీ ఒకసారి ఆ పాత్ర అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు. సరిగ్గా అక్కడే దర్శకుడు విజయం సాధించాడంటూ రాజమౌళి గురించి వ్యాఖ్యానించారు జేమ్స్ కామరూన్.

james cameron & director rajamouli

అంతే కాదు ఇదే విషయం తాను స్వయంగా రాజమౌళికి కూడా చెప్పానన్నారు జేమ్స్. ఆ దర్శకుడితో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదున్నారు. అతనితో ఎక్కువ మాట్లాడలేకపోయానని, జనసందోహం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం గడపలేకపోయానన్నారు. మరోసారి టైమ్ దొరికితే మాత్రం తప్పకుండా రాజమౌళితో మాట్లాడి సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ఉందని కామెరూన్ అన్నారు. తాను కెనాడాకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఇండియన్స్ ఈ సినిమా చూశాక ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోగలనని అన్నారు. ఇందులో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు.

తండ్రిగా గర్విస్తున్న – చిరంజీవి (Megastar Chiranjeevi) 

ఇక దీనిపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. జేమ్స్ కామెరూన్ తన కొడుకుని ఇలా పొగడంతో చిరంజీవి సంతోషం పట్టలేకపోయారు. వెంటనే ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ ఏమన్నారంటే.. జేమ్స్ కామరూన్ సర్… మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవం. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version