Site icon Prime9

Megastar Chiranjeevi : నేటితో 45 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న మెగాస్టార్.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్

Megastar Chiranjeevi completed 45 years in tollywood

Megastar Chiranjeevi completed 45 years in tollywood

Megastar Chiranjeevi : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండి తెరపై ఎంట్రీ తనకు తానుగా కష్టాన్నే నమ్ముకొని ఎందరికో ఆదర్శంగా నిలిచి.. కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాక్సాఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తూ తెలుగు తెర ఇలవేల్పు గా అభిమనులతో కొనియాడబడుతున్నారు. కేవలం సినిమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కావొచ్చు, అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తూ టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.

ఇక  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. రీసెంట్ గా “భోళా శంకర్” గా వచ్చి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయారు. అయినా సరే తగ్గేదే లే అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే ఇవ్వాళ చిరంజీవి కి మరపురాని రోజు అని చెప్పాలి.

చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు 22 సెప్టెంబర్ 1978 లో రిలీజయ్యి నేటికి 45 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ పై 45 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తయినందుకు ఎమోషనల్ గా ఓ ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ లో.. మన మెగాస్టార్ ( Megastar Chiranjeevi ) చిరంజీవి గారికి 45 ఏళ్ళు సినిమాలో మెగా జర్నీ చేసినందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రాణం ఖరీదు సినిమాతో మొదలుపెట్టి ఇప్పటికి ఇంకా ఆయన ప్రయాణం అద్భుతమైన జర్నీ. ఎన్నో లక్షల మందిని మీరు స్క్రీన్ మీద మీ నటనతో, స్క్రీన్ బయట మీ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి నింపారు. థ్యాంక్యూ నాన్న. డిసిప్లేన్, హార్డ్ వర్క్, డెడికేషన్, ఎక్సలెన్స్.. వీటన్నిటిని మాలో నింపినందుకు అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

 

Exit mobile version