Site icon Prime9

Chiranjeevi : పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తుంటే చాలా బాధగా ఉంటుంది : చిరంజీవి

megastar chiranjeevi comments about pawan kalyan

megastar chiranjeevi comments about pawan kalyan

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించనుండగా… శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ ఓ రేంజ్ లో అదరగొట్టాయి. మెగాస్టార్ సినిమాలో రవితేజ కూడా నటిస్తుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ టీమ్ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు.

ఈ క్రమంలోనే చిరంజీవి ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తన ప్రేమని వ్యక్తం చేశాడు. పవన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. వాటిని విన్నపుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటూ యాంకర్ ప్రశ్నించారు. అందుకు చిరంజీవి బదులిస్తూ… వాడిని నా చేతులు మీదగా ఎత్తుకొని పెంచాను. నేను, నా భార్య సురేఖ వాడికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళం. పవన్ కి కూడా మా మీద అంతే ప్రేమ ఉంటుంది. వాడికి డబ్బు ఆశ లేదు, పదవి కాంక్ష లేదు, నిజం చెప్పాలి అంటే మొన్నటి వరకు వాడికి సొంత ఇల్లు కూడా లేదని అన్నారు.

అదే విధంగా ఏ మాత్రం స్వార్ధం లేని వ్యక్తి పవన్ అని… ప్రజలకి ఏదో మంచి చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చాడు. మంచి చేద్దామనే వ్యక్తిని ప్రోత్సహిండం మానేసి, మితిమీరిన విమర్శలు చేస్తుంటే బాధ అనిపిస్తుంది. అయితే పవన్ అంతలా విమర్శించిన వాళ్ళు, మళ్ళీ నా దగ్గరకి వచ్చి ఫంక్షన్స్ కి రమ్మని పిలుస్తుంటారు. నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్ళతో నేను మాట్లాడాల్సి వస్తున్నా, కలవాల్సి వస్తున్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటూ చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ “వీర సింహారెడ్డి”… విజయ్ “వారసుడు”… అజిత్ “తెగింపు” చిత్రాలు బరిలో ఉన్నాయి.

Exit mobile version