Site icon Prime9

Bhola Shankar : భోళా శంకర్ నుంచి మరో లీక్ ఇచ్చిన చిరు.. ఈసారి మెగా ఫ్యాన్స్ కి పండగే !

megastar chirajeevi one more leak from bhola shankar movie

megastar chirajeevi one more leak from bhola shankar movie

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ కోసం మెగా ఫ్యాన్స్‌తో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీలో చిరుకి జోడీగా తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేష్, సుశాంత్, పలువురు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ చిత్రం.

ఇక రీసెంట్ గా మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి చిరు లీక్స్ చేశారు. అయితే ఈ సారి చిరంజీవి చేసిన లీక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, మెగా ఫ్యాన్స్ ని ఫుల్ గా ఖుషి చేస్తున్నాయి. తన వాయిస్ ఓవర్ తో చిరంజీవి తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ఎప్పటి లాగే చిరు లీక్స్ తో వచ్చాను. (Bhola Shankar) భోళా శంకర్ సినిమా నుంచి మీకోసం ఒక అప్డేట్ తెచ్చాను. మెహర్ రమేష్ తిట్టుకున్నా పర్లేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నా ఫొటోలు, నా డైలాగ్స్, నా సాంగ్స్ తో మిమ్మల్ని అలరించాడు. ఇప్పుడు నేను మీ కోసం తమ్ముడి డైలాగ్స్, మేనరిజమ్స్ ఈ సినిమాలో అనుకరించబోతున్నాను. ఇది మిమ్మల్ని, అభిమానులని ఎంటర్టైన్ చేస్తుందని భావిస్తున్నాను అని తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

 

 

మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం అంటే అభిమానులకి పండగే అని చెప్పాలి. ఇందులో పవన్ ఏ మేరా జహాఁ సాంగ్ ప్లే చేసి పవన్ లాగ మెడ మీద చెయ్యి వేసి అలరించారు చిరంజీవి. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం బాగా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version