Site icon Prime9

Sharwand Wedding : శర్వానంద్ – రక్షిత పెళ్లి వేడుకల్లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

mega power star ram charan spotted in Sharwand Wedding

mega power star ram charan spotted in Sharwand Wedding

Sharwand Wedding : టాలీవుడ్ హీరో శర్వానంద్.. తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెబుతూ ప్రస్తుతం ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ( జూన్ 3, 2024 ) రాత్రి 11:30 గంటలకు జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి జరగనుంది. ఈ మేరకు శుక్రవారం నుంచే లీలా ప్యాలెస్ లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్, హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. శర్వానంద్ తో సన్నిహితంగా ఉండే హీరోలు అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్లి వేడుకల కోసం లీలా ప్యాలెస్ ను సుందరంగా తీర్చిదిద్దారు. వరుడు శర్వానంద్, వధువు రక్షిత కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రులు శుక్రవారం ఉదయానికే జైపూర్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేయనున్నాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితతో శర్వానంద్ కు జనవరి 26న ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. రక్షిత తండ్రి తెలంగాణ హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి మనవరాలు అని తెలిసిందే. రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ చేస్తోంది.

 

Exit mobile version