Site icon Prime9

Ram Charan : ప్రభాస్ #MSMPrecipechallenge ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్.. ఫేవరెట్ వంటకం అదేనా !

mega power star ram charan accepted prabhas #MSMPrecipechallenge

mega power star ram charan accepted prabhas #MSMPrecipechallenge

Ram Charan : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేస్తుండగా.. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. అలానే ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు ముఖ్య పత్రాలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరించాయి. నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క శెట్టి స్టార్ట్ చేసిన #MSMPrecipechallenge ఛాలెంజ్ ముందుకు పోతుంది. తన చెఫ్ పాత్రకు తగ్గట్టు గానే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక కొత్త ఛాలెంజ్ ని మొదలు పెట్టింది. ఈ ఛాలెంజ్ లో ఫేవరెట్ ఫుడ్ ఐటెం అండ్ దాని రెసిపీని షేర్ చేయాలి అని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే అనుష్క.. మంగుళూరు చికెన్ క్రరీ, నీర్ దోశ తన ఫేవరెట్ అంటూ రెసిపీని షేర్ చేసింది. ఆ తరువాత ప్రభాస్ కి ఈ ఛాలెంజ్ ని ఇచ్చింది. ఇక అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్.. ‘రొయ్యల పలావ్ ’ తన ఫేవరెట్ డిష్ అంటూ అందుకు సంబంధించిన రెసిపీని షేర్ చేశాడు. అలాగే ఈ ఛాలెంజ్ ని రామ్ చరణ్ కి ఇచ్చాడు.

తాజాగా చరణ్ (Ram Charan) ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తన ఫేవరెట్ రెసిపీని తెలిపాడు. ‘నెల్లూరు చేపల పులుసు’ తన ఫేవరెట్ వంటకం అని.. దాని రెసిపీని షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్ ని తాను రానాకి షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రమోషన్స్ లో అనుష్క మాట్లాడుతూ.. ప్రభాస్ మంచి ఫుడీ అని అందరికి తెలిసిందే. మిర్చి సమయంలో మేము ఎక్కువ క్లోజ్ అయ్యాం. అప్పుడు అందరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం.. టిఫిన్ కే చాలా రకాలు ఉండేవి. టిఫిన్ కే భారీగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఓ పక్కన టిఫిన్ చేస్తూనే మధ్యాహ్నం లంచ్ గురించి.. లంచ్ లో ఏం తినాలి అను మాట్లాడుకునేవాళ్ళు. అది చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని. ప్రభాస్, ప్రమోద్ లతో కలిసి తినడం మొదలు పెడితే ఫుడీస్ కూడా తినడం మానేయాల్సిందే. వాళ్ళు అంత బాగా తింటారు అని చెప్పింది. దీంతో అనుష్క ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

 

 

Exit mobile version