Site icon Prime9

Meenakshi Chaudhary : మహేష్ బాబు “గుంటూరు కారం” గురించి సీక్రెట్ చెప్పిన మీనాక్షి చౌదరి..

meenakshi chaudhary comments on mahesh guntur karam movie

meenakshi chaudhary comments on mahesh guntur karam movie

Meenakshi Chaudhary : టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ. తాజాగా అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2లో నటించింది. ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించి మెప్పించింది. కాగా త్వరలో విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఓ ఆసక్తికర  విషయాన్ని రివీల్ చేసింది.

కాగా త్రివిక్రమ్ –  మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా “గుంటూరు కారం”. సినిమా ఎప్పుడో మొదలయిన కానీ ఇప్పటిదాకా సగం షూటింగ్ కూడా పలు కారణాలతో పూర్తి కాలేదు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా.. పూజా హెగ్డే మూవీ నుంచి తప్పుకుండాని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. పూజా హెగ్డే ప్లేస్ లో వేరే హీరోయిన్ ని తీసుకున్నట్టు కొంతమంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవలే గుంటూరు కారం షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశారని సమాచారం. అయితే హీరోయిన్ మీనాక్షి చౌదరి.. గుంటూరు కారంలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ వార్తలను కన్ఫర్మ్ చేసింది ఆ హాట్ బ్యూటీ.

హత్య మూవీ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమాలో పనిచేయడం చాలా గొప్పగా ఉంది. నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. షూటింగ్ లో మహేష్ బాబు గారితో మొదటి రోజు, మొదటి షాట్ మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమా విషయంలో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అని ప్రకటించింది. దీంతో మహేష్ అభిమానులంతా ఫుల్ జోష్ లో ఉన్నారు.

 

 

Exit mobile version