Manchu Manoj Wedding : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి పేర్లు ఎక్కువగా వార్తల్లో కూడా వినిపించాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. అలానే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ భూమా మౌనికా రెడ్డితో పెళ్లిని గానీ, ప్రేమ విషయాన్ని గానీ మనోజ్ అధికారికంగా ప్రకటించలేదు.
పెళ్లి కూతుర్ని పరిచయం చేసిన మనోజ్(Manchu Manoj Wedding)..
అయితే తాజాగా మంచు మనోజ్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు. దివంగత రాజకీయ నేతలైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డిని ఆయన పెళ్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య మౌనిక ఫొటోను సోషల్ మీడియాలో మనోజ్ పోస్ట్ చేశాడు. ‘పెళ్లికూతురు భూమా మౌనిక’ అని ట్వీట్ చేశాడు. పెళ్లికి ముస్తాబవున్న భూమా మౌనికారెడ్డి.. కూర్చొని ఉన్న ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో `పెళ్లి కూతురు` అంటూ `మనోజ్ వెడ్స్ మౌనికా` అనే యాష్ ట్యాగ్‌ని షేర్ చేశారు. ఇక తాజాగా మంచు మనోజ్ పంచుకున్న ట్వీట్‌కి వారి అభిమానులు స్పందిస్తున్నారు. కాబోయే కొత్త జంటకి విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేడియకగా పోస్ట్ లు పెడుతున్నారు.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023
కాగా తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి జరుగనుంది. పెళ్లి వేడుక మొత్తం మంచు లక్ష్మి చేతుల మీదుగానే జరగనున్నట్టు సమాచారం. ఇరు కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి జరగనుంది. వీరి వివాహం ఈ రాత్రి 8.30 గంటలకు జరగనుంది. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. మనోజ్ కు 2015లో ప్రణతీ రెడ్డితో పెళ్లి జరిగింది. అయితే 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు. మంచు మనోజ్ చివరిగా ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2017 లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత రెండు సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించి అలరించాడు. ప్రస్తుతం దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వనున్నాడు ఈ యంగ్ హీరో. వరుణ్ అనే కొత్త వ్యక్తి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం చేస్తున్న మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్ ని ఖరారు చేయగా.. ‘మనం మనం బరంపురం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చుట్టూ గ్యాంగ్ స్టార్స్ ఉంటే మధ్యలో మంచు మనోజ్ నుంచి ఉన్న దృశ్యం కనిపిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/