Site icon Prime9

Manchu Manoj: ‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది.. లవ్ యూ’ : మంచు మనోజ్

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు శుక్రవారం వివాహ బంధంతో ఓక్కటయ్యారు. ఫల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం జరిగింది.

మంచు మోహన్ బాబు, విష్ణు తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కొత్త జంటను ఆశీర్విందించారు. ప్రస్తుతం మంచు మనోజ్ (Manchu Manoj), మౌనికా రెడ్డి (Mounika Reddy) ల ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

 

ఆకట్టుకుంటున్న మనోజ్ పోస్ట్(Manchu Manoj)

కాగా, ఈ పెళ్లికి సంబంధించి మంచు మనోజ్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బాగా ఆకట్టుకుంటోంది.

మనోజ్, తన సోదరి నటి మంచు లక్ష్మీ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారో అందరికీ తెలిసిందే.

లక్ష్మీ గురించి ‘ అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. లవ్ యూ అక్కా అండ్ థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్’ అంటూ కృతజ్ఞతలు చెప్పాడు.

మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ లక్ష్మీ అన్ని తానై ఈ పెళ్లి జరిపించినట్టు తెలుస్తోంది.

మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇంకెవరి పేరు కూడా ప్రస్థావన లేకుండా మనోజ్ పోస్ట్ పెట్టడం గమనార్హం.

 

 

మనోజ్ పెళ్లికి పెద్దగా మారిన లక్ష్మీ

నిజానికి మంచు మనోజ్ , మౌనికా రెడ్డి ల పెళ్లి మోహన్ బాబు ఇష్టం లేదని చాలా రోజుల నుంచి వార్తలు వస్తునూ ఉన్నాయి.

తాజాగా మనోజ్ పెట్టిన పోస్ట్ అది నిజమే అనే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే లక్ష్మీ పెళ్లిని దగ్గరుండి అన్నీ దగ్గరుండి చూసుకున్నందుకు అక్కపై మనోజ్ తన ప్రేమను చాటుకున్నాడు.

లక్ష్మీ కూడా గతంలో పలు మార్లు విష్ణుతో కన్నా మనోజ్‌తోనే ఎక్కువగా ఉంటానని చెప్పింది. ఇద్దరం అక్కాతమ్ముళ్ల కంటే కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఎక్కువగా ఉంటామని చెప్పుకొచ్చింది.

అందుకే ఇప్పుడు మనోజ్ పెళ్లికి పెద్దగా మారి., అన్నీ అడ్డంకులను దాటించి… అతనిని ఓ ఇంటివాడిని చేసిందని అంతా అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే స్వయంగా మనోజే ఈ పోస్ట్ ద్వారా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు.

 

Exit mobile version