Site icon Prime9

Manchu Manoj: అదంతా తప్పుడు ప్రచారం – మంచు విష్ణు కామెంట్స్‌కి మనోజ్‌ రియాక్షన్‌

Manchu Manoj Latest Comments: మంచు మనోజ్‌ తన అన్నయ్య మంచు విష్ణు ప్రెస్ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాచకొండ సీపీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాసేపటికే క్రితమే ఓ ప్రెస్‌ మీట్‌ చూశాను. అందులో మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. మా అమ్మ హాస్పిటల్‌లో లేరు. నా కూతురు, భార్యతో కలిసి ప్రస్తుతం తను జల్‌పల్లి ఇంట్లోనే ఉన్నారు. ఈ గొడవలో నా ఏడేళ్ల పాపని, భార్య పేరు వాడారు.

ఇప్పుడు మా అమ్మను అడ్డుకుని పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కన్నతల్లిని ఇలా చేయకండి అని వేడుకుంటున్నా. ఎప్పుడైనా కూర్చోని మాట్లాడుకోవడానికి నేను సిద్ధమే” అని చెప్పాడు. అయితే సాయంత్రం వరకు ఈ సమస్యను పరిష్కరించుకుంటామని విష్ణు ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటలపై ఓ విలేఖరి మనోజ్‌ని ప్రశ్నించారు. దీనికి మనోజ్‌ అలా అయితే మంచిదే కదా, అందరికి మంచి జరిగితే మంచిదే. ఊరోళ్లందరికి మంచి జరగాలి అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీలో విషయంలో వినయ్‌ మహేశ్వరి చేసే పనులు నాకు నచ్చడం లేదు. వాటికి నాకు సమాధానం చెప్పాలి. మా నాన్న అక్కడి ప్రజలు చదువు అందాలని, రాయలసీమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అక్కడ విద్యాసంస్థలను స్థాపించారు. కానీ వాటిలో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని నాన్న దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ఆయన దాక ఈ విషయాలు చేరకుండ అడ్డుపడుతున్నారని ఆరోపించాడు. మా నాన్న దేవుడు, ఈ రోజు చూసిన ఆయన.. ఆయన కాదు. ఈ గొడవలు వేరేవాళ్లు కారణమంటూ మంచు పేర్కొన్నాడు.

Exit mobile version