Site icon Prime9

kantara: కాంతార మూవీ చూస్తూ వ్యక్తి మృతి.. ఎక్కడంటే..?

man died while watching kantara movie

man died while watching kantara movie

kantara: ఇటీవల విడుదలైన చిత్రాల్లో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. కన్నడ సినిమా అయిన కాంతార తాజాగా తెలుగులోనూ విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదుచేస్తుంది. భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు.. మూవీ మేకర్స్ అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. కనుమరుగవుతున్న హిందూ సంప్రదాయాల్లో ఒకటైన కన్నడ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం ప్రజలకు గుర్తు చేసే చిత్రం ఇది.
కాగా ఈ సినిమాపై స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, కంగనా రనౌత్‌, ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు కూడా కాంతారా సినిమాను చూసి సూపర్ అంటూ తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కాంతార సినిమా చూస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు వదిలారని తెలుస్తోంది. రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఈ సినిమా చూస్తూ కూర్చున్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక దీనిని గమనించిన పక్క వ్యక్తులు థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించారు. దానితో ఆ వ్యక్తి అలా కింద పడిపోవడంతో వెంటనే థియేటర్ యాజమాన్యం సమీపంలోని ఆసుపత్రికి వెంటనే తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారట.

ఇప్పుడు ఇదే వార్త కన్నడనాట వినిపిస్తోంది. ఈ సినిమాలో భూత కోల ఆచారాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక పోతే భూత కోల ఆడుతున్నప్పుడు రిషబ్ శెట్టి నటన అయితే ప్రేక్షకుల మైండ్ లో పాతుకుపోయిందని చెప్పవచ్చు. ఈ సన్నివేశాలను చూపిస్తున్నప్పుడు చాలా మంది ప్రేక్షకులు తన్మయులయ్యారు మరికొందరు భయపడినట్టు చెప్తున్నారు.

ఇదీ చదవండి: “కాంతార” మూవీకి కాపీరైట్ ఇష్యూ..!

Exit mobile version