Site icon Prime9

Mahesh Babu: మై లిటిల్‌ ఫ్రెండ్‌ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది – సుకుమార్‌ కూతురుపై మహేష్‌ ప్రశంసలు

Mahesh Babu Tweet on Gandhi Tatha Chettu: క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు తెరకెక్కింది. పద్మావతి మల్లాద్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు జనవరి 14న థియేటర్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా గాంధీ తాత చెట్టు చిత్రంలో అద్భుతంగా నటించావంటూ సుకృతిపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా సినిమాపై రివ్యూ ఇస్తూ ఆసక్తిక కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం మహేష్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

“గాంధీ తాత చెట్టు.. ఈ సినిమా మీ జీవితాల్లో భాగం అవుతుంది. డైరెక్టర్‌ పద్మమల్లాడి.. అహింస అనే పాయింట్‌ తీసుకుని దానిని అందంగా మలిచి మీ జీవితాల్లోకి తీసుకువస్తున్నారు. ఇక మై లిటిల్‌ ఫ్రెండ్‌ సుకృతివేణి.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాతో అందమైన నటిగా నువ్వు ఎదిగిన తీరు.. నీ అద్భుతమైన నటన చూస్తుంటే నాకు నీపై గౌరవం పెరుగుతుంది. గాంధీ చెట్టు చిన్న మాస్టర్‌ పీస్‌ సినిమా. మీరంత కూడా ఈ సినిమా ఎంజాయ్‌ చేయండి” అంటూ మహేష్‌ ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు.

ప్రస్తుతం మహేష్‌ ట్వీట్‌ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. కాగా ఈసినిమా ట్రైలర్‌ని కూడా మహేష్‌ బాబు ఆన్‌లైన్‌ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆయన ఈ చిన్న సినిమాకు సపోర్టు ఇస్తూ వస్తుండటంతో ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ సంస్థ‌లపై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్‌ భార్య తబితా సుకుమార్ ఈ చిత్రానికి సమర్పకురాలుగా వ్యవహరించింది. రిలీజ్‌కు ముందే విదేశాల్లో పలు అవార్డుఉ అందుకు ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Exit mobile version