Site icon Prime9

Mahesh Babu: రీ-రిలీజ్ లోనూ ’పోకిరి‘ రికార్డు

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టినరోజు సందర్బంగా, అతని ఆల్-టైమ్ సూపర్ హిట్ చిత్రం పోకిరి మళ్లీ రిలీజ్ అయింది. 9వ తేదీ సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా 375 కంటే ఎక్కువ షోలు ప్రదర్శించబడ్డాయి. ఈ చిత్రం 1.73 కోట్ల రూపాయల భారీ వసూళ్లను వసూలు చేసింది. ఇది రీ-రిలీజ్ చేయబడిన భారతీయ సినిమాచరిత్రలో రికార్డు. భారతదేశం మరియు యూఎస్ఎఅంతటా ప్రదర్శనలు హౌస్‌ఫుల్‌గా సాగాయి.

ఈ చిత్రం వసూళ్ల ద్వారా సేకరించిన మొత్తం ఎంబి ఫౌండేషన్ కోసం విరాళంగా ఇవ్వబడుతుంది. ఇది ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా పిల్లల ఆరోగ్య చికిత్స కోసం ఉపయోగించబడుతుంది. ఇటీవల కాలంలో మహేష్ బాబు పలువురు పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. మొత్తంమీద మహేష్ అభిమానులు మరలా పోకిరి ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించి, నిర్మించిన పోకిరిలో మహేష్ బాబు మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటించారు. పోకిరి రిలీజ్ తో ఇప్పుడు, పలువురు ఇతర హీరోల అభిమానులు కూడ తమ హీరోల పాత చిత్రాలను రీ రిలీజ్ చేయాలని కోరడం విశేషం.

Exit mobile version