Site icon Prime9

Mahesh babu: ‘ఇది మీ కోసమే నాన్న..’ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Mahesh babu

Mahesh babu

Mahesh babu: సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబో లో వస్తున్న కొత్త సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌, మహేశ్‌ బాబు చేస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఊరమాస్ లుక్‌లో

SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ తలకు ఎర్ర టవల్‌ కట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. ‘ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ గారి లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ’ అంటూ కృష్ణగారి ఫోటోని పెట్టారు. ఈ పోస్టర్‌ ఫైట్‌ సీన్‌కి రిలేటడ్ గా అనిపిస్తోంది. కాగా, ఈ మూవీ టైటిల్‌ని మే 31 సాయంత్రం రివీల్‌ చేయనున్నారు. ఈ పోస్టర్‌ని మహేశ్‌ తన ట్విటర్‌ లో షేర్‌ చేస్తూ.. ‘ఈ రోజు మరింత ప్రత్యేకమైంది. ఇది మీ కోసమే నాన్న’ అని క్యాప్షన్‌ పెట్టాడు. మహేశ్‌ చేసిన ట్వీట్, సినిమా లుక్ ఇపుడు ట్రెండింగ్ గా మారాయి.

 

 

‘మోసగాళ్లకు మోసగాడు’ డిజిటలైజ్(Mahesh babu)

మరోవైపు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను డిజిటలైజ్ చేసిన 4 కె ఫార్మాట్ లో బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా ప్రదర్శించే అన్నీ థియేటర్లలో మహేశ్ బాబు కొత్త మూవీ టైటిల్ ను ‘ మాస్ స్ట్రైక్ ’ పేరుతో అభిమానుల చేత విడుదల చేయనున్నారు.

 

Exit mobile version