Site icon Prime9

Leader Sequel: ’లీడర్ ‘సీక్వెల్ లో మహేష్ బాబు ?

Mahesh Babu in Leader 2

Leader Sequel: దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో లీడర్ ఒకటి. రానా దగ్గుబాటి హీరోగా నటించిన తొలి ప్రాజెక్ట్ ఇది. ప్రతిష్టాత్మక బ్యానర్ ఎవిఎం ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో లీడర్ 2 సినిమా చేయడానికి శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతోంది. ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహన్‌ని సమీప భవిష్యత్తులో లీడర్ 2 చేసే అవకాశం గురించి అడిగినపుడు ఆమె స్పందించారు..దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరిగాయి, అయితే ఇంకా ఏదీ కన్ ఫర్మ్ కాలేదు. వేచి చూడాలి అని ఆమె పేర్కొన్నారు. ఎవిఎం భవిష్యత్తులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వంటి తెలుగు సినిమా యొక్క అతిపెద్ద స్టార్స్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తోందని ఆమె అన్నారు.

Leader sequel

శివాజీ 2 సీక్వెల్ పై కూడ ఆమె వివరణ ఇచ్చారు. శివాజీ మొదటి భాగం కంటే శివాజీ 2 కథ చాలా శక్తివంతమైనది.ముందు కథ రెడీ చేయాలి, ఆ తర్వాత శంకర్ సర్ మరియు రజనీ సార్ చేయడానికి సిద్ధంగా ఉండాలి” అని అరుణ పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar