Site icon Prime9

Sithara Ghattamaneni : ప్రెస్టీజియ‌స్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌ పై మహేష్ బాబు కూతురు “సితార”..

mahesh babu daughter Sithara Ghattamaneni on newyork time squares

mahesh babu daughter Sithara Ghattamaneni on newyork time squares

Sithara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే.  చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సితార..  చిన్న వ‌య‌సులోనే యూ ట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌చిన ఆమె ఇప్పుడు మ‌రోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే దానికి సంబంధించిన షూటింగ్‌ను సితార పూర్తి చేసింది. ఆ మ‌ధ్య దానికి సంబంధించిన వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. కాగా.. ఇప్పుడు సితార న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌కు సంబంధించిన ఫొటోల‌ను ప్రెస్టీజియ‌స్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి. కాగా అటు మహేష్ అభిమానులు సైతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టైం స్క్వేర్ లో సితారని ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని, చిన్న వయసులో సితారకి దక్కిన గొప్ప గౌరవం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమం లోనే మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ మేరకు అ ట్వీట్ లో.. “సితారని టైం స్క్వేర్ పై చూడడం ఆనందంగా, గర్వంగా ఉంది. ఇలాగే కొనసాగుతూ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలి” అని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు. ఇక జులై 4 న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సితార కు సంబంధించిన ఈ ఫోటోలను టైమ్స్ స్క్వేర్ పై ప్రదర్శించారు.

ఇక ఈ అరుదైన ఘనతతో సితార మరోసారి సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు కొడుకు బర్త్‌డే ఈవెంట్ లో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. మూవీలో మహేష్ కి జోడిగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ గ్లిమ్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టింది.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Exit mobile version