Site icon Prime9

Liger: ’లైగర్‘ కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

Tollywood: విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం లైగర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టేటస్‌ను పరిశీలిస్తే అవి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. అతని చిత్రం విడుదల రోజున ప్రేక్షకులు థియేటర్లకు భారీగానే వస్తారని రుజువయింది. తాజా అడ్వాన్స్ బుకింగ్స్ స్టేటస్ ప్రకారం లైగర్ కు ఓపెనింగ్స్ భారీగా వస్తాయని, అయితే లాంగ్ రన్ అనేది నోటి మాటపైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇది విజయ్ దేవరకొండకు మాత్రమే కాదు, పూరీ జగన్నాథ్‌కి కూడా బాక్పాఫీసు వద్ద పరీక్షే.

Exit mobile version