Site icon Prime9

Chandramukhi 2 : “చంద్రముఖి 2” నుంచి లారెన్స్ ఫస్ట్ లుక్ ఔట్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే ?

Lawrence look released from chandramukhi 2 movie

Lawrence look released from chandramukhi 2 movie

Chandramukhi 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు. కాగా మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. కొన్ని నెలల క్రితం చంద్రముఖి 2 తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ చిత్రానికి కూడా వాసునే డైరెక్షన్ చేస్తుండగా రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తుండడం గమనార్హం.

సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. (Chandramukhi 2 ) తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

తాజాగా ఈ సినిమా (Chandramukhi 2) నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వెట్టియన్ రాజాగా లారెన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక అలానే ఈ సినిమాను వినాయకచవితికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. చంద్రముఖి 2 సినిమాని ఈ సారి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 15న విడుదల కానుండగా ప్రేక్షకులని ఈ మూవీ ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.

 

 

Exit mobile version