Site icon Prime9

Puneeth Idol: తెనాలిలో కన్నడ హీరో పునీత్ కు 21 అడుగుల భారీ విగ్రహం

Puneeth Raj kumar idol in tenali

Puneeth Raj kumar idol in tenali

Puneeth Idol: దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఈరోజుకు అక్టోబర్‌ 29 సరిగ్గా ఏడాది గడిచిపోయింది. జిమ్ చేస్తూ గతేడాది ఆకస్మిక మరణం చెందారు. దానితో ఆయన ఫ్యాన్ మరియు కుటుంబ సభ్యులు యావత్ సినీలోకం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పవర్ స్టార్ కు కన్నడతో పాటు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగునాట కూడా ఆయనకు అశేష అభిమానలు ఉన్నారు. ఈ తరుణంలోనే పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు ఫ్యాన్స్.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి తమ అభిమాన నటుడు పునీత్ జ్ఞాపకార్థం ఓ భారీ విగ్రహాన్ని సిద్దం చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఫైబర్ గ్లాస్ తో పునీత్ విగ్రహాన్ని వారు తయారు చేశారు. కాగా త్వరలోనే ఈ విగ్రహాన్ని బెంగళూరుకి తరలించనున్నట్టు పేర్కొన్నారు. ఈ విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని శిల్పులు తెలిపారు. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని అందించనుంది. కాగా ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నట్టు సమాచారం. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే పునీత్ గతేడాది ఇదే రోజున గుండెపోటుతో మరణించాడు. కాగా అప్పు లేడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. కాగా నేడు అప్పు మొదటి వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులు కన్నడ నాట అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నాను. ఇక పునీత్‌ కుటుంబ సభ్యులు అప్పు సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించుకున్నారు.

ఇదీ చదవండి: సౌత్ ఇండియాలోనే మహేష్ టాప్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Exit mobile version