Site icon Prime9

Miss Shetty Mr Polishetty : సూపర్ స్టార్ అనుష్క, నవీన్ “మిస్‌ శెట్టి.. మిస్టర్‌  పొలిశెట్టి” నుంచి లేడి లక్ సాంగ్ రిలీజ్..

lady luck song released from miss-shetty-mr-polishetty movie

lady luck song released from miss-shetty-mr-polishetty movie

Miss Shetty Mr Polishetty : సూపర్ స్టార్ అనుష్క శెట్టి.. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తన నటనతో, అందంతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళ్ భాషలలొ స్టార్ హీరోలు అందరి సరసన నటించి సూపర్ స్టార్ గుర్తింపును తెచ్చుకుంది. ఇక బాహుబలి సినిమాతో అనుష్క క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. అయితే పలు కారణాలు రీత్యా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న స్వీటీ.. మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ భామ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. “మిస్‌ శెట్టి.. మిస్టర్‌  పొలిశెట్టి” అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేశ్‌బాబు తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కాగా తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో ప్లస్ అని చెప్పాలి.

మూవీ రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ చిత్ర (Miss Shetty Mr Polishetty) టీజ‌ర్‌, పోస్ట‌ర్ల‌తో పాటు నో నో నో, హ‌త‌విధి పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా “లేడి ల‌క్” అంటూ సాగే పాట.. వీడియో సాంగ్ ని రీలజ చేశారు. ఇక ఈ వీడియో సాంగ్‌లో నవీన్ పొలిశెట్టి ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అదే విధంగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్‌ పాడారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చెఫ్‌ అన్వితా రవళిగా అనుష్క..  స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధుగా నవీన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.

 

 

Exit mobile version