Site icon Prime9

Vinaro Bhagyamu Vishnu Katha Movie: ఫిబ్రవరి 17 విడుదలవనున్న “వినరో భాగ్యము విష్ణుకథ”

viaro bhagyamu vishnu katha movie release date announced

viaro bhagyamu vishnu katha movie release date announced

Vinaro Bhagyamu Vishnu Katha Movie: హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. కాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. గీతా ఆర్ట్స్2 పతాకంపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మూవీమేకర్స్ వెల్లడించారు.

రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంది క్రేజ్ తెచ్చుకున్నారు.0 అయితే ప్రస్తుతం కిరణ్‌, కశ్మీర పరదేశి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కాగా షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా ప్రకటించారు చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఈ చిత్రానికి మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తుండగా చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. విలేజ్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా వస్తోన్నట్టు మూవీ మేకర్స్ తెలిపారు.

ఇదీ చదవండి: గూస్ బంప్స్ తెప్పిస్తున్న”రుద్రుడు” మూవీ గ్లింప్స్

Exit mobile version
Skip to toolbar