Kiara-Sidharth wedding: బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7 న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్, జైసల్మేర్ లోని సూర్యగఢ్ లోని ప్యాలెస్ లో ఘనంగా వివాహ వేడుకలు జరిగాయి.
ఈ పెళ్లికి ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ లోని హీరోలకు సైతం కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా వివాహానికి ఆహ్వానం అందింది.
అందులో రామ్ చరణ్ దంపతులు ఉన్నారు. అయితే సినిమా షూటింగ్ బిజీలో ఉండటం వల్ల రాంచరణ్ దంపతులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కాలేక పోయారు.
అయితే ఇదే విషయంపై కియారా అద్వానీ కి.. ఉపాసన క్షమాపణలు చెప్పారు. వీలు పడకపోవడం వల్ల పెళ్లికి రాలేదని ఉపాసన అన్నారు.
కంగ్రాట్స్ కియారా: ఉపాసన (Kiara-Sidharth wedding)
పెళ్లికి సంబంధించిన ఫొటోలు కియారా అద్వానీ సోషల్ మీడియా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. కియారా పోస్టుపై ఎంతో మంది ప్రముఖలు రియాక్ట్ అవుతున్నారు.
కొత్త జంటకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఉపాసన స్పందిస్తూ.. ‘ కంగ్రాట్స్ కియారా. మీ జంట చాలా అందంగా ఉంది.
పెళ్లికి రాలేకపోయినందుకు సారీ.’ అంటూ కామెంట్ పెట్టింది. కాగా బోయపాటి శ్రీను డైరెక్టర్ గా ‘వినయ విధేయ రామ’ సినిమాలో రాంచరణ్, కియారా జంటగా నటించారు.
అప్పటి నుంచి ఉపాసన, కియారా మంచి స్నేహితులయ్యారు. కాగా శంకర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆర్సీ 15’ లో కూడా కియారా అద్వానీ నే హీరోయిన్.
కొత్త జంటకు శుభాకాంక్షల వెల్లువ (Kiara-Sidharth wedding)
కాగా కియారా- సిద్ధార్ధ్ జంటకు చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాంచరణ్, సమంత, కత్రినాకైఫ్, ఆలియా భట్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, ఆతియా శెట్టి వంటి పలువురు విషెస్ చెప్పారు.
నిర్మాత కరణ్ జోహార్ సైతం నూతన జంటపై సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఒకే లక్షణాలు ఉన్న ఇద్దరు కలిసి అద్భుతమైన లవ్ స్టోరీని సృష్టించారు.
వివాహబంధంతో ఒక్కటైన ఈ జంటను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. వీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కరణ్ పేర్కొన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/