Kiara-Sidharth wedding: బాలీవుడ్ ప్రేమపక్షులు కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంత కాలంలా డేటింగ్ ఉన్నట్టు బీటౌన్ లో న్యూస్ హల్ చల్ చేసింది.
అయితే ఆ జంట మాత్రం వాళ్ల రిలేషన్ పై ఎప్పుడూ రియాక్ట్ అవలేదు. అయితే తాజా వార్తల ప్రకారం.. ఈ జంట పెళ్లీ పీటలు ఎక్కనుంది.
ఈ వారంలోనే కియారా, సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. అందుకు ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. పంబాబీ సంప్రదాయం లో వీరి వివాహం జరగనుంది.
రాజస్థాన్ లో పెళ్లి వేడుక (Kiara-Sidharth wedding)
దేశంలో ప్రముఖ సెలెబ్రిటీల పెళ్లిళ్లన్నీ దాదాపుగా రాజస్థాన్ లోనే జరిగాయి. ప్రియాంక చోప్రా- నిక్కీజోనస్, కత్రినా- విక్కీ కౌశల్,
శ్రేయ- ఆండ్రూ.. ఇలా చాలామంది స్టార్స్ రాజస్థాన్ కోటల్లోనే ఒక్కటయ్యారు.
ఇక్కడ పెళ్లి అంటే అదొక ప్రస్టేజ్ సింబల్‌గా మారింది.
తాజాగా కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి (Sidharth Malhotra-Kiara Advani) కూడా రాజస్థాన్, జైసల్మేర్ లోని సూర్యగఢ్ పైవ్ స్టార్ హోటల్లో జరుగుతందని సమాచారం.
ఇప్పటికే అక్కడ పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కొనసాగుతున్నాయి. పెళ్లి వచ్చే గెస్ట్ ల కోసం లగ్జజీ విల్లాలను బుక్ చేశారట.
7 న గ్రాండ్ గా రెసెప్షన్
ఫిబ్రవరి 4,5 తేదీల్లో మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరుగనున్నాయి.
అనంతరం ఫిబ్రవరి 6 న ఈ జంట వివాహబంధంతో ఒక్కటవుతారు.
7 న ముంబైలో గ్రాండ్ గా రెసెప్షన్ నిర్వహించునున్నట్టు సమాచారం.
మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు వైభవంగా నిర్వహించేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ జంట వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు , దగ్గరి ఫ్రెండ్స్ మాత్రమే హాజరుకానున్నారు.
వెడ్డింగ్ కోసం భారీ ఏర్పాట్లు
పెళ్లికి హాజరయ్యే గెస్ట్ లిస్ట్ లో ఇషా అంబానీ , ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా, అశ్విని యార్డి, వరుణ్ ధావన్ , కరణ్ జోహార్,
మీరా కపూర్, షాహిద్ లతో పాటు 125 మంది అతిథులను వేడుకకు ఆహ్వానించినట్టు టాక్ వస్తోంది.
అదే విధంగా పెళ్లి కి స్పెషల్ మెనూను రెడీ చేస్తోంది ఈ జంట(Sidharth Malhotra-Kiara Advani ).
సంప్రదాయ రాజస్థాన్ వంటకాలతో పాటు కాంటినెంటల్, ఇండియన్ రుచులను వడ్డించేందుకు ప్లాన్ చేశారట.
పెళ్లికి వచ్చిన గెస్టులు థార్ ఎడారి అందాలను చూసేందుకు ప్రత్యేకంగా ఒంటెల సఫారీ లను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
షేర్హా మూవీలో తొలిసారి కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హాత్రా కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు.
కాగా కియారా మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్ కు పరిచయం అయింది.
అనంతరం రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’లో నటించింది.
తర్వాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలతో దూసుకెళ్తొంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/