Site icon Prime9

KGF : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్.. ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిద్దా !

kgf makers planning to releasing the movie in japan

kgf makers planning to releasing the movie in japan

KGF : భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు రాకింగ్ స్టార్ యష్. ఒకే ఒక్క సినిమాతో గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది కేజీఎఫ్ రెండవ భాగం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్ సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కి సమానంగా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది కేజీఎఫ్ చాప్టర్ 2. ర్యాంపేజ్ అనే పదానికి అసలైన అర్దం చెప్పేలా.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లా నిలిచింది ఈ చిత్రం.

2018 లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా కేజీఎఫ్-1. ఆ తరువాత 2022 లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయ్యిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. 1500 కోట్ల వరకు కలెక్షన్ అందుకొని ఇండియన్ టాప్ మూవీగా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాకీ భాయ్ గా యశ్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 14, 2023 కి ఏడాది పూర్తయ్యింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం జపాన్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. జులై 14న కేజీఎఫ్ 1&2 ని ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడడంతో జపనీస్ అభిమానులు కోసం యశ్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు. జపనీస్ కి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన యశ్.. చాలా రోజులు కేజీఎఫ్ ని గుర్తు పెట్టుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా జపాన్ లో RRR ని సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. చూడాలి మరి జపాన్ లో ఈ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అని.

 

ఇటీవల ప్రేక్షకులకు కేజీఎఫ్ 3 గురించి అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్‌-3 పై హింట్‌ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్‌-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీడియో చివర్లో ‘‘రాఖీ భాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు?’’ అంటూ హీనత ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర మూడో భాగం రాఖీ భాయ్‌ కనిపించకుండా పోయిన ఆ నాలుగేళ్లలో ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అన్నది చూపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version