keerthy suresh: నటి కీర్తి సురేశ్.. ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు ఈ మధ్య హల్ చల్ చేశాయి. ఓ వ్యక్తి తో కీర్తి సురేష్ దిగిన ఫొటో ఒకటి బయటకు రావడంతో.. కీర్తి పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరగుతోంది. ఫొటో లో ఉన్న వ్యక్తే.. కీర్తికి కాబోయ్ వరుడంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై కీర్తి సురేష్ రియాక్ట్ అయింది. అతను తన స్నేహితుడని క్లారిటీ ఇచ్చింది. పెళ్లి అని వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చేసింది.
ఇక సదరు ఫొటోపై వస్తున్న వార్తలపై కీర్తి సురేశ్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి లాగారా. (కాబోయే వరుడిని ఉద్దేశిస్తూ) నిజమైన మిస్టరీ మ్యాన్‌ను టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటివరకూ చిల్‌గా ఉండండి. ఒక్కసారి కూడా సరైన వార్తలను ప్రచారం చేయరు’ అని అందులో పేర్కొంది. అయినా ఇప్పటికీ పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడకపోవడంతో.. కీర్తి సురేశ్ తండ్రి సురేష్ కుమార్ ఓ వీడియో విడుదల చేశారు.
కుటుంబంలో మనశ్శాంతి కరవు(keerthy suresh)
ఆ వీడియోలో ‘ఈ మధ్య కీర్తి సురేశ్ తన ఫ్రెండ్‌తో దిగిన ఫొటోపై అనేక రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆ అబ్బాయి కీర్తికే కాదు.. మాకు కూడా బాగా తెలుసు. తన పేరు ఫర్హాన్ . అతడి పుట్టినరోజు సందర్భంగా కీర్తి.. సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేసి అతడికి విషెస్ తెలిపింది. దీనిపై ఫస్ట్ ఒక తమిళ మీడియా వార్తలు రాసింది. ఆ తర్వాత అన్నీ ఛానల్స్‌లో వార్తలు వచ్చాయి. కీర్తి సురేశ్‌కు పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు మేమే ముందుగా చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్ క్రియేట్ చేయొద్దు. ఇలాంటి రూమర్స్ వల్ల కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుంది’అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ ‘భోళా శంకర్’మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా నటిస్తోంది. దీనితో పాటు ‘రఘు తాత’ లోనూ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.