Site icon Prime9

Casting Couch : క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన కీర్తి సురేష్..!

keerthi suresh shocking comments about casting couch

keerthi suresh shocking comments about casting couch

Keerthi Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ” కీర్తి సురేష్ “. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత నుంచి పలు సినిమాల్లో ఈ భామ నటించినప్పటికీ సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి. ఇటీవల మహేష్ బాబు సరసన ” సర్కారు వారి పాట ” అనే మూవీలో నటించగా… ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

కాగా ఇప్పడు తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది కీర్తి. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులు నిజమేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, ఇతర నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారని ఆమె వివరించారు. మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నామనే దాన్ని బట్టి కూడా కమిట్మెంట్ అడుగుతారేమోనని కీర్తి అభిప్రాయపడ్డారు. అందుకే తనకు ఇంతవరకు అలాంటి సందర్భం ఎదురుకాలేదని కీర్తి తెలిపింది.

ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటానని వెల్లడించింది. అంతే కానీ అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే రకం కాదని తేల్చి చెప్పింది. కాగా కీర్తి ప్రస్తుతం తెలుగులో నాని హీరోగా నటిస్తున్న ” దసరా ” అనే చిత్రంలో, మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ” భోళా శంకర్ ” మూవీలో నటిస్తుంది. వీటితో పాటు పలు తమిళ సినిమాల్లోనూ కీర్తి నటిస్తుంది.

Exit mobile version