Site icon Prime9

Rashmika Mandanna: రష్మిక మందన్నాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Congress MLA Fires on Rashmika Mandanna: నేషనల్‌ క్రష్‌ రష్మక మందన్నా తరచూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కన్నడిగుల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఆమె సక్సెస్‌ రాగానే దానికి తలకి ఎక్కించుకుందని, తన మూలలనే మరిచిపోతుందంటూ తరచూ కన్నడిగులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవల ఓ ఈవెంట్‌లో తాను హైదరాబాద్‌ నుంచి వచ్చానని చెప్పి తన అసలు గుర్తింపును మరిచిపోయింది. ఇది కన్నడ ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రష్మికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవి గనిక సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కి రష్మక రాకపోవడంపై ఆయన స్పందించారు. నటిగా తనకు గుర్తింపు ఇచ్చింది కన్నడ పరిశ్రమ, కానీ ఈ ఇండస్ట్రీనే ఆమె విస్మరించిందని, రష్మికకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

“రష్మిక ‘రిక్‌ పార్టీ’ కన్నడ సినిమాతోనే సినీ కెరీర్‌ ప్రారంభించింది. దీంతో బెంగళూరులో జరుగుతున్న ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు రావాలని తనని ఆహ్వానించాం. కానీ కర్ఱాటక వచ్చేంత తీరిక తనకు లేదని చెప్పింది. తాను హైదాబాద్‌లో ఉంటున్నానంటూ మాట్లాడి కర్ణాటక ఎక్కడ ఉందో తెలియదు అన్నట్టు వ్యవహరించింది. గతంలోనూ మా పార్టీకి చెందిన సభ్యులు ఆమెకు ఎన్నోసార్లు కలిసి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. కానీ ఆమె మాత్రం వచ్చేందుకు సముఖత చూపించలేదు. కన్నడ చిత్ర పరిశ్రమ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తోంది. రష్మిక ప్రవర్తనకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?” అన్నారు.

ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే ఆయన కామెంట్స్‌ రష్మిక టీం స్పందించినట్టు తెలుస్తోంది. బెంగళూరు ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు రష్మిక రానని చెప్పిందనడంలో వాస్తవం లేదని, ఇవి నిరాధారమైన ఆరోపణలు స్పష్టం చేసింది. అలాగే ఆమె అగౌరవంగా మాట్లాడిందన్న మాటల్లోనూ నిజం లేదని, ఆమెను ఎవరూ ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆహ్వానించారనేది కూడా నిజం కాదని ఆమె సన్నిహితవర్గాలు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. మరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలపై రష్మిక ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిని సంతరించుకుంది.

Exit mobile version
Skip to toolbar