Site icon Prime9

Kareena Kapoor: సైఫ్‌ అలీఖాన్‌ దాడి – మీడియాకు కరీనా కపూర్‌ నిబంధనలు

Kareena Kapoor and Saif Ali Khan Request to Paparazzi: బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తాజాగా మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తన భర్త సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో సైఫ్‌, కరీనాలు మీడియాకు కొన్ని నిబంధనలు ఇచ్చారు. ఈ మేరకు వారి పీఆర్‌ టీం మంగళవారం మీడియాతో సమావేశమైంది. కరీనా కపూర్‌, సైఫ్‌ ఇద్దరు స్టార్‌ సెలబ్రిటీలే. దీంతో వారు ఎక్కడ కనిపించిన మీడియా ఫోటోలు తీస్తూ వెంటపడుతుంది. ముఖ్యంగా వారి పిల్లలు తైమూర్‌ అలీకాన్‌, జహింగీర్‌ అలీ ఖాన్‌ల ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వారు ఎక్కడ కనిపించిన పదే పదే ఫోటోలు తీస్తుంటారు. ఈ క్రమంలో తైమూర్‌, జేహ్‌లు సైతం ఫోటోలు తీయొద్దంటూ మీడియాతో చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

అయితే ఇటీవల సైఫ్‌పై జరిగిన దాడి తర్వాత వారి సెక్యూరిసిటీదృష్ట్యా మీడియాకు కొన్ని నిబంధలు పెట్టారు. ఈ మేరకు కరీనా టీం మీడియా ప్రతినిధులతో సమావేశమై వాటిని వివరించాడు. ఇక నుంచి తైమూర్‌, జేహ్‌ ఎక్కడ కనిపించిన వారి ఫోటోలు తీయొద్దని కండిషన్‌ పెట్టారు. స్కూల్‌కు వెళ్తుండగా, పుట్టిన రోజు వేడుకల్లో, క్రిడా కేంద్రాల్లో కనిపించిన వారి ఫోటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే కరీనా, సైఫ్‌ల ఫోటోల కోసం కూడా వారి ఇంటి ముందు ఉండోద్దని కోరినట్టు పీఆర్‌ టీం వెల్లడించినట్టు బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఏదైనా మూవీ ఫంక్షన్‌లో తమ ఫోటోలు తీసుకోవచ్చని తెలిపారు.

కాగా ఈ నెల 16న సైఫ్‌పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దొంగతనం కోసం బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు వారి చిన్న కుమారుడు జేహ్‌ గదిలోకి వెళ్లాడు. అతడిని గమనించిన జేహ్‌ కేర్‌టేకర్‌ అరవడంతో సైఫ్, కరీనాలు అక్కడికి వచ్చారు. దుండగుడు చూసి పట్టుకునే ప్రయత్నం చేయగా.. అతడు సైఫ్‌పై కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో సైఫ్‌ ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు తగడంతో రక్తమోడుతున్న సైఫ్‌ తన కుమారుడు తైమూర్‌, కేర్‌టేకర్‌ సహాయంతో ఆటోలో ముంబైలో లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. వెన్నుముక భాగంలో కత్తి మొన విరిగినట్టు, మేడ భాగంలో లోతుగా కత్తిగాటు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

ఆయనకు సర్జరీ చేసి కత్తి మొన తొలగించారు. సర్జరీ అనంరతం నాలుగు, ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆ తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే సైఫ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే దాడి ఘటనపై కరీనా సోదరుడు జహాన్‌ కపూర్‌ స్పందిస్తూ.. సైఫ్‌ త్వరగా కోలుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ దాడి ఘటనతో తమ కుటుంబం ఆందోళన చెందిందని, ఇలాంటి వాటిని ఎదుర్కొవడం చాలా కష్టమన్నారు. దాగి గురించి తెలియగానే అందరం ఎంతో బాధపడ్డాం.. ఆ రోజు మా అందరికి చికటి రోజు అనే చెప్పాలి. సైఫ్‌ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని చెప్పుకొచ్చారు.

Exit mobile version