Site icon Prime9

Kantara: బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టిన “కాంతార”.. దేశంలోనే @1

kantara movie got first rank in idbm

kantara movie got first rank in idbm

Kantara: ఇప్పుడే నోట విన్నా కాంతారా మూవీ హవా కొనసాగుతుంది. కాంతారా చిత్రానికి వచ్చినంత పాజిటివ్ టాక్ ఇటీవల వచ్చిన ఏ చిత్రాలకూ రాలేదు. కన్నడలో ప్రభంజనం సృష్టించిన కాంతారా దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా దెబ్బకు అన్ని సినీ ఇండస్ట్రీలు షాక్ అవుతున్నాయి. రిషభ్ శెట్టి నటన, దర్శకత్వం చూసి అందరూ ఫిదా అవుతున్నారు. కాంతారా దెబ్బకు ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు చిన్నబోయాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతం కాంతారా చిత్రం మరో రికార్డును సాధించింది. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

రిషభ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా చిత్రం ఇప్పుడు కలెక్షన్లలో మోత మోగిస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కన్నడలో వంద కోట్లు కలెక్ట్ చేసిన అతి కొద్ది చిత్రాల్లో కాంతారా ఒకటిగా నిల్చుంది. కాంతారా దెబ్బకు బాహుబలి,కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు సైతం బద్దలయ్యాయి. కన్నడలో ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే వంద కోట్లు కొల్లగొట్టేసింది. కనీసం 20కోట్లు కూడా పెట్టకుండా రూపొందించిన ఈ సినిమా కేవలం కన్నడలోనే వంద కోట్లు కలెక్షన్లను రాబట్టింది.

కాగా ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో ఈ మూవీ విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్లా ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో పదిహేను కోట్లు గ్రాస్, హిందీలో ఆల్రెడీ పది కోట్ల షేర్ రాబట్టేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డును బ్రేక్ చేసింది. ఇండియన్ మూవీ డేటా బేస్(ఐఎండీబీ)లో కాంతారా చిత్రం నెంబర్ వన్ స్థానంలోకి నిలించింది. టాప్ 200 సినిమాల్లో కాంతారా ప్రథమ స్థానంలోకి వచ్చింది. కాగా కేజీయఫ్ 128, ఆర్ఆర్ఆర్ 190, బాహుబలి 101వ స్థానంలో ఉన్నాయి. అలా ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలన్నింటిని కాంతారా వెనక్కి నెట్టేసిందని చెప్పవచ్చు.

ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ.. తన ముగ్గురు స్నేహితులవీ ఆత్మహత్యే..!

Exit mobile version