Site icon Prime9

Kamal Haasan : నేను సినిమా ప్రేమికుడిని.. కొత్త ప్రయత్నాలు చేయాలనే చూస్తా – కమల్ హాసన్

kamal haasan responce on acting in project k movie

kamal haasan responce on acting in project k movie

Kamal Haasan : మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ప్రాజెక్ట్ కె”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తుంది. కాగా ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా.. కమల్ హాసన్ కూడా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో పాటు మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోలు, గ్లింప్స్ లతో ఈ చిత్రం హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుందని అనిపిస్తుంది.

ఆదివారం నాడు కమల్ హాసన్ ఈ మూవీలో నాటిస్తున్నారని అఫిషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు విషెష్ చెప్తూ సినిమా టీంని కూడా అభినందించారు. ఈ క్రమంలోనే తాజాగా “ప్రాజెక్ట్ కె” సినిమాలో నటించడంపై స్పందిస్తూ కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా ఓ లెటర్ ని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఈ లెటర్ లో.. 50 ఏళ్ళ క్రితం నేను డ్యాన్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు సినీ నిర్మాణంలో అశ్వినీదత్ పేరు బాగా వినిపించేది. ఇప్పుడు మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ K కోసం పనిచేస్తున్నాం. నాగ్ అశ్విన్ కొత్త తరం దర్శకుడు, చాలా ట్యాలెంట్ ఉన్నవాడు. ప్రభాస్, దీపికా కుడా చాలా ట్యాలెంటెడ్ యాక్టర్స్. అమితాబ్, నేను గతంలో కలిసి పనిచేశాం. అయినా కొత్తగానే ఉంటుంది ప్రతిసారి. అమితాబ్ ప్రతి సినిమాకి తనని కొత్తగా ఆవిష్కరించుకుంటాడు. నేను అదే బాటలో ప్రయాణిస్తున్నాను. నేను సినిమా ప్రేమికుడిని. పరిశ్రమలో కొత్త ప్రయత్నాలు చేయాలనే చూస్తాను. ఈ సినిమా విషయంలో తొలి ప్రశంస నాదే. దేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులందరినీ నాగ్ అశ్విన్ ఈ సినిమాతో మెప్పిస్తాడు అని కమల్ రాసుకొచ్చారు. దీంతో కమల్ ట్వీట్ వైరల్ గా మారింది.

 

ఇటీవలే విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక డైరెక్ట్ తెలుగు సినిమాలో కమల్ నటించి చాలా కాలం అవుతుంది అని చెప్పాలి. 1995 లో చివరిసారిగా తెలుగులో డైరెక్ట్ గా “శుభ సంకల్పం” అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు.

Exit mobile version