JD Chakravarthi : ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శివ చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన జేడీ ఆ తర్వాత మనీ, గులాబీ, సత్య.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకాదరణ పొందగలిగారు. కాగా సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వగా.. మళ్ళీ ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు.
ఇక ఇటీవలే జేడీ చక్రవర్తి నటించిన ఓ వెబ్ సిరీస్ లో యాంకర్ విష్ణు ప్రియ కూడా నటించింది. దాంతో ఈ సీనియర్ హీరోపై ఈ హాట్ యాంకర్ మనసు పారేసుకున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఓ షోలో మాట్లాడుతూ విష్ణు ప్రియ జేడీ చక్రవర్తి గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. జేడీ చక్రవర్తి అంటే ఇష్టం అని.. ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని, వాళ్ళ అమ్మని కూడా ఒప్పిస్తానని చెప్పుకొచ్చింది. దీంతో విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక తాజాగా ఆమె చేసిన కామెంట్స్ పై చక్రవర్తి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నేను, విష్ణుప్రియ కలిసి ఓ సిరీస్ లో నటించాం. అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి షూట్ చేశాం. ఆ సమయంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది కానీ అది ప్రేమ కాదు. ఇక ఆ సిరీస్ డైరెక్టర్ కూడా నాతో ఇంకా బాగా విష్ణుప్రియ నటించాలని తనని నా సినిమాలను చూడమన్నాడు. అలా ఆమె నా క్యారెక్టర్స్ తో ప్రేమలో పడింది. అంతే తప్ప ఇంకేమీ లేదని.. మా ఇద్దరి మధ్య ఉన్నది గురు – శిష్యుల అనుబంధం అని తెలిపారు. చూడాలి మరి మళ్ళీ విష్ణు ఈ మాటల పట్ల ఏ విధంగా స్పందిస్తుందో అని..
ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పోవే పోరా అనే ప్రోగ్రాంతో బుల్లితెర కు యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఉండగా విష్ణు ప్రియ వెండితెరలో కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలో కూడా నటించింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో 2 చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ చిత్రాలు విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో విష్ణు ప్రియా కు సరైన గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. ఇక ఇటీవల యాంకరింగ్ కి బై చెప్పేసి గ్లామర్ షో చేస్తూ అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది.