Site icon Prime9

Jagadeka Veerudu Athiloka Sundari 2: జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో చిరు, చరణ్

Tollywood: మెగా-ప్రొడ్యూసర్ అశ్వినీదత్ తమ గత మెగా బ్లాక్ బస్టర్ “జగదేకవీరుడు అతిలోకసుందరి” కి సీక్వెల్ నిర్మించాలని చాలా కాలంగా కోరికను వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం చిరు, దర్శకుడు కె రాఘవేంద్రరావు మరియు నిర్మాత దత్‌ల కెరీర్ లో మైలురాయిగా నిలిచింది.

కొన్ని ఇటీవలి ఇంటర్వ్యూలలో కూడా నిర్మాత అశ్విని దత్, రామ్ చరణ్ తో ఈ చిత్రానికి సీక్వెల్ ను చేయాలనే కోరికను వ్యక్తం చేసారు. అంతేకాదు మెగాస్టార్ చిరు కూడ ఒక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఇదే విషయమై గతంలో ఆయన చిరంజీవితో మాట్లాడారని తెలిసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నారు. అయితే ఆ కథ మెగాస్టార్‌కి నచ్చలేదు.

రామ్ చరణ్ హీరోగా నటించే ఈ సీక్వెల్ కోసం సరికొత్తగా కథను రూపొందించే బాధ్యతను మెగాస్టార్ దత్ కు అప్పగించినట్లు సమాచారం. కె రాఘవేంద్రరావు ఇప్పుడు చేయనందున ఈ సినిమాకు సరైన దర్శకుడిని కూడ వెతకాలని భావిస్తున్నారు. మంచి స్క్రీన్ ప్లే, విజువల్ ఎఫెక్టులతో ఈ సోషియో ఫాంటసీని తెరకెక్కించే దర్శకుడు దొరికితే, చిరు రెడీ అయి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Exit mobile version