Site icon Prime9

Samantha: సమంత ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ.. ఇవిగో ఫొటో ఫ్రూవ్స్

Samantha face plastic surgery

Samantha face plastic surgery

Samantha: టాలీవుడ్ అగ్ర కథానాయికగా వెలుగొందుతూ, పాన్ ఇండియా సినిమాలతో నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు సమంత. కాగా కొద్దిరోజులుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్టార్ హీరోయిన్ పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలె ఈమె ఫేస్ కు సర్జరీ చేయించుకున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత ఎంత సైలెంట్‌గా ఉంటున్నా కూడా ఆమెపై నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అయితే సమంత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. కాగా గత నెలలో సమంతకు చర్మ వ్యాధి సోకిందంటూ మీడియాలో మరియు నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో సమంత మేనేజర్ ఈ వార్తలను ఖండించారు. మామూలుగా అయితే సమంతే రూమర్లపై స్పందిస్తూ గట్టి కౌంటర్లు వేస్తుంది. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో సమంత సైలెంట్ అయింది. మరి సమంత ఇంత సైలెంట్ గా ఉండడానికి గల కారణాలేంటనేవి తెలియరాలేదు. ఈ నేపథ్యంలో సమంతకు గతంలోనే చర్మానికి సంబంధించిన వ్యాధి ఉందని, ఇప్పుడు అది మళ్లీ ఎక్కువైందని, అందుకే తను షూటింగ్‌లకు దూరంగా ఉంటోందని ఫిలిం ఇండస్ట్రీ నాట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సమంత మొహానికి సర్జరీ జరిగిందనే రూమర్లు బయటకు వచ్చాయి. ఆమె తాజాగా చేసిన యాడ్, అందులోని ఫోటోలను గమనిస్తే సమంత మొహంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మరి దీనిలో నిజానిజాలెంతా అనేది తెలియరాలేదు.

ఇదీ చదవండి: “కాంతార”కు కదిలిన ప్రభుత్వం.. స్పెషల్ స్క్రీన్ పై మూవీ చూడనున్న ప్రధాని

Exit mobile version