Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారట. ఇందులో మరో విశేషం అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ ఇదే .తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య మేకోవర్ అండ్ గెటప్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై సౌత్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘కంగువా’ గురించి నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.” సినిమా ప్రస్తుతం మేకింగ్ స్టేజ్ లో ఉంది. విడుదలకు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కంగువా మూవీని ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఐమాక్స్, త్రీడీ వెర్షన్ లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. తమిళ చిత్ర పరిశ్రమ స్తాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతోంది “అని అన్నారు. దీంతో జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇదే కనుక నిజమైతే పాన్ వరల్డ్ స్థాయిలో అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ‘కంగువా’ మూవీ ఏకంగా మూడు భాగాలుగా రాబోతోంది. పార్ట్-1 అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధిస్తే మిగతా భాగాలను తెరకెక్కించే ప్లాన్ లో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది . ఇక ఈ సినిమాలో సూర్య ఏకంగా ఆరు విభిన్న తరహా అవతారాల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.అందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని అంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..