Site icon Prime9

Guntur Karam Movie : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లో హిట్ బ్యూటీ కన్ఫర్మ్ అయ్యిందా..?

interesting details about mahesh babu guntur karam movie

interesting details about mahesh babu guntur karam movie

Guntur Karam Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం “గుంటూరు కారం”.  ఈ సినిమాకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మహేష్‌ ఊరమాస్‌ లుక్‌ అదిరిపోయింది. అయితే మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక ఇబ్బంది ఎదుర‌వుతూనే ఉంది. దీంతో సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డేట్ క్లాష్ ల వ‌ల్ల ఈ సినిమా నుంచి పూజా హెగ్డే త‌ప్పుకునట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. దీంతో మూవీ యూనిట్ కొత్త హీరోయిన్ వేటలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రీలీల ఓ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక.. పూజా స్థానంలో గోల్డెన్ లెగ్ బ్యూటీ  సంయుక్త మీన‌న్‌ ను హీరోయిన్ గా తీసుకున్నార‌నే వార్త‌లు వినిపించాయి.

SSMB 28: Mahesh Babu To Romance Don Fame Priyanka Mohan in Trivikram's Film  Along With Pooja Hegde? - Filmibeat

అయితే తాజాగా సంయుక్త కాకుండా.. మీనాక్షి చౌదరిని ఎంచుకున్నార‌ని నెట్టింట ఓ వార్త షికారు కొడుతోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌నుంద‌ని అంటున్నారు. కాగా.. ఇందులో ఎంత నిజం ఉంద‌ని చిత్ర బృందం స్పందించే వ‌ర‌కు వేచి చూడక తప్పదు. ‘ఇచ్చ‌ట వాహ‌నాలు నిలుప‌రాదు’ అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మీనాక్షి చౌదరి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా.. ర‌వితేజ స‌ర‌స‌న ‘ఖిలాడీ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా ‘హిట్‌-2’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. దాంతో పాటు సోష‌ల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన భారీ అందాలను ఆరబోస్తూ మంచిగా ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.

 

Exit mobile version
Skip to toolbar