Site icon Prime9

Actor Nikhil : జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న నిఖిల్.. బర్త్ డే గిఫ్ట్ గా రెండు కొత్త మూవీ అప్డేట్స్

interesting details about actor nikhil new movies

interesting details about actor nikhil new movies

Actor Nikhil : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2 చిత్రం చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలే 18 పేజీస్ సినిమాతో లవర్ బాయ్ గా వచ్చిన ఈ హీరో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక తన ఇమేజ్ ని కాపాడుకునేలా తన తదుపరి ప్రాజెక్ట్స్ ని కూడా సెట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్.. అందరికీ ఫుల్ గా నచ్చేసి సినిమాప్ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. గర్రి బిహెచ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే ఇటీవలే రామ్ చరణ్ నిర్మాణంలో ‘ది ఇండియన్ హౌస్’ అంటూ ఇంకో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు. కాగా ఇప్పుడు తాజాగా తన బర్త్ డే గిఫ్ట్ గా మరో రెండు కొత్త ప్రాజెక్ట్ లని ప్రకటించాడు నిఖిల్.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన 20వ సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఫాంటసీ డ్రామాగా వారియర్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలియజేశాడు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒక బంగారు రాజదండం కనిపిస్తుంది. అది చూస్తుంటే ఇటీవల కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ఉపయోగించిన ‘సింగోల్’లా కనిపిస్తుంది. ఆ సింగోల్ తమిళనాడు ట్రెడిషన్ అని అందరికీ తెలిసిందే. ఒక రాజు నుంచి మరో రాజుకి అధికారం బదిలీ చేయడాన్ని గుర్తుగా సింగోల్ ని ఉపయోగిస్తారు. దీంతో ఈ పోస్టర్ తో సినిమాపై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈరోజు రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు.

ఈ సినిమాలతో పాటు నిఖిల్, తనకి కంబ్యాక్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మతో మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. స్వామిరారా, కేశవ సినిమాలు సుధీర్ వర్మ-నిఖిల్ కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడో సినిమా అనౌన్స్ అయ్యింది. మరి ఈ సినిమాల టైం లైన్స్ ఏంటి? ఏ మూవీ ముందు ఆడియన్స్ ముందుకి వస్తుంది లాంటి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

 

 

Exit mobile version
Skip to toolbar