Hollywood: హాలీవుడ్ బంద్.. సమ్మె బాట పట్టిన సినీ కళాకారులు, ఆర్టిస్టులు.. కారణం ఏంటంటే??

Hollywood: హాలీవుడ్ లో రైటర్స్, యాక్టర్స్ సమ్మెకు దిగారు. నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు పొందుతున్నా తమకు మాత్రం కనీస వేతనం కూడా ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు.

Hollywood: హాలీవుడ్ లో రైటర్స్, యాక్టర్స్ సమ్మెకు దిగారు. నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు పొందుతున్నా తమకు మాత్రం కనీస వేతనం కూడా ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు. మరికొందరు నిర్మాతలైతే కథల కోసం ఏఐలను ఆశ్రయించడం ఇలా అనేక అంశాల ద్వారా తమకు చాలా అన్యాయం జరుగుతుందంటూ నెల రోజుల క్రితం రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్స్ కూడా సమ్మెకు దిగారు.

స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సడెన్ గా సమ్మెకు దిగింది. రైటర్స్ సమ్మెకు దిగినప్పుడు నిర్మాణ సంస్థల యూనియన్ అయిన అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో మాట్లాడి తమ డిమాండ్స్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కూడా నిర్మాణ సంస్థతో మాట్లాడినా వారు పట్టించుకోకపోవడంతో అకస్మాత్తుగా వారు సమ్మెకు దిగారు. ఆల్మోస్ట్ 80 శాతం మంది యాక్టర్స్ ఈ సమ్మెలోకి దిగారు.

రైటర్స్ బాటలోనే యాక్టర్స్(Hollywood)

రైటర్స్ కోరుకుంటున్న డిమాండ్స్ నే యాక్టర్స్ కూడా కోరుకుంటున్నారు. నిర్మాణ సంస్థలు మంచి లాభాలు ఆర్జిస్తున్నా సరైన రెమ్యూనిరేషన్ ఇవ్వట్లేదని వారు అంటున్నారు. అంతే కాకుండా సినిమా నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్రని తగ్గించాలని వారు కోరారు. అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వట్లేదని, షూటింగ్ లో సరైన సదుపాయాలు కూడా కలిపించట్లేదని చెప్తూ వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డిశ్చర్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న రాత్రి స్ట్రైక్ అనౌన్స్ చేశారు. రైటర్స్ గిల్డ్ అమెరికా సమ్మెకు కూడా యాక్టర్స్ కూడా మద్దతువచ్చారు.

దీంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు, స్ట్రీమింగ్ ఓటీటీలు, టీవీ సంస్థలు ఏం చెయ్యాలో పాలుపోక తలల పట్టుకున్నాయి. ఈ సమ్మె త్వరగా విరమించకపోతే టెలికాస్ట్ చేయడానికి కంటెంట్ ఉండదని అవి భయపడుతున్నాయి. దీంతో హాలీవుడ్ కొన్ని రోజులు మూతపడనుందా, కార్యక్రమాలు ఆగిపోనున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సమ్మె జరుగుతున్నప్పుడు తమ పాత సినిమాలు కూడా యాక్టర్స్ ప్రమోట్ చేయడానికి వీల్లేదు. దీంతో త్వరలో పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి ఉండటంతో వాటి ప్రమోషన్స్ మీద కూడా ఈ సమ్మె ఎఫెక్ట్ పడనుంది.